పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఎక్స్ లో ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ కి పవన్ కళ్యాణ్ బదులివ్వడం ఇప్పుడు నెట్టింట ఆకర్షిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నట ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ ఆయనకు ఇటీవల శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ శుభాకాంక్షలు పై రజనీకాంత్ తాజాగా స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా సోదరుడు, పొలిటికల్ తుపాను పవన్ కల్యాణ్ గారు.. ప్రేమతో మీరు చెప్పిన విషెస్‌కు ఉప్పొంగిపోయా.
దాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నా. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రజనీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. రజనీ ట్వీట్ కి పవన్ కల్యాణ్ కూడా స్పందిస్తూ.. ‘‘బిగ్ బ్రదర్ రజనీకాంత్.. మీ అభిమానం, ఆశీస్సులకు కృతజ్ఞుడిని. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి. మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’’ అని తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.