సైమన్‌కు లెనిన్ కంగ్రాట్స్.. కింగ్ ఇరగదీశాడట..!

సైమన్‌కు లెనిన్ కంగ్రాట్స్.. కింగ్ ఇరగదీశాడట..!

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్న కూలీ చిత్రం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ దగ్గర తన మేనియాతో ఊపేస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో సైమన్ అనే విలన్ పాత్రలో అక్కినేని నాగార్జున నటించిన తీరు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. నాగార్జునను ఇప్పటివరకు చూడని పాత్రలో చూసి అభిమానులు సైతం ఖుషీ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా సైమన్ పర్ఫార్మెన్స్‌కు ‘లెనిన్’ అఖిల్ అక్కినేని కూడా ఫిదా అయ్యాడు. తన తండ్రి నాగార్జున చేసిన పాత్రకు వస్తున్న థండర్ రెస్పాన్స్‌తో ఆయన తన తండ్రితో సంతోషాన్ని జరుపుకున్నారు.

దీనికి సంబంధించిన ఫోటో ఆయన తన ఇన్‌స్టో స్టోరీలో షేర్ చేశాడు. తండ్రి చేసిన మేటి పర్ఫార్మెన్స్‌కు కొడుకు ఇచ్చిన ట్రీట్ అదిరిందని అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.