అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాల్లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘డకాయిట్’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు షేనియల్ డియో డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే, ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అయితే, ఈ చిత్రాన్ని హిందీ మార్కెట్‌లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కానీ, ఈ సినిమాకు బాలీవుడ్‌లో గట్టి పోటీ తప్పేలా లేదు. డకాయిట్ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం కూడా డిసెంబర్ 25న రానుంది. ఈ చిత్రాన్ని అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఆలియా భట్, శర్వారి కలిసి నటిస్తున్న ‘ఆల్ఫా’ చిత్రం కూడా డిసెంబర్ 25న రానుంది. ఈ రెండు సినిమాలు కూడా డకాయిట్ చిత్రానికి గట్టి పోటీ ఇవ్వనున్నట్లు బి టౌన్ వర్గాలు చర్చిస్తున్నాయి.
మరి అడివి శేష్ ‘డకాయిట్’కు ఈ రెండు బాలీవుడ్ చిత్రాలు ఎలాంటి పోటీని ఇస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా అనుకున్న డేట్‌కే రిలీజ్ అవుతుందా లేక రిలీజ్ డేట్‌లో మార్పు ఉంటుందా అనేది వేచి చూడాలి.