‘విశ్వంభర’ రిలీజ్ అంత లేట్ గానా?

‘విశ్వంభర’ రిలీజ్ అంత లేట్ గానా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం ‘విశ్వంభర’ కూడా ఒకటి. అయితే చాలా కాలం తర్వాత చిరు నుంచి అనౌన్స్ చేసిన స్ట్రైట్ సినిమా అందులోని తనకి మంచి పట్టు ఉన్న ఫాంటసీ జానర్ లో అనౌన్స్ చేసేసరికి గట్టి హైప్ సెట్ అయ్యింది. కానీ సినిమా అలా ఆలస్యం అవుతూ రావడం మాత్రం ఫ్యాన్స్ కి నిరాశగా మారుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి మరో షాకింగ్ రూమర్ ఇపుడు వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా ఏకంగా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యిపోయినట్టుగా టాక్ వైరల్ అవుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యేలా సన్నాహాలు జరుగుతున్నాయట. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్స్ ని మేకర్స్ చాలా ఛాలెంజింగ్ గా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నట్టు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.