‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ ప్రకటన.. ఎప్పుడంటే..?

‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ ప్రకటన.. ఎప్పుడంటే..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. దర్శకుడు వశిష్ట మల్లిడి డైరెక్ట్ చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం భారీ వీఎఫ్ఎక్స్ వర్క్‌తో రూపొందించారు. అయితే, ఈ సినిమాకు కీలకంగా మారిన గ్రాఫిక్స్ విషయంలో మేకర్స్ సంతృప్తిగా లేకపోవడంతో ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా విశ్వంభర నుంచి ఓ సాలిడ్ అప్డేట్ రానుందని తెలుస్తోంది. అయితే, ఇది రిలీజ్ డేట్ అయి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ, మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రానున్న ‘విశ్వంభర’ అప్డేట్ రిలీజ్ వాయిదా అని సినీ సర్కిల్స్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ పోస్ట్ పెట్టాడు. విశ్వంభర చిత్రానికి సంబంధించి అతి ముఖ్యమైన ప్రకటన రేపు(ఆగస్టు 21) ఉదయం 09.09 గంటలకు రానుందని ఆయన తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.