సినిమాల్లో రీఎంట్రీకి సిద్ధమవుతున్న ‘ఆనందం’ హీరోయిన్ రేఖ

సినిమాల్లో రీఎంట్రీకి సిద్ధమవుతున్న ‘ఆనందం’ హీరోయిన్ రేఖ
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒకప్పటి హీరోయిన్లు వరుసగా రీ-ఎంట్రీ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ జాబితాలో మన్మధుడు ఫేం అన్షు, నటి లయ, జెనీలియా వరుసగా సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక ఇప్పుడు ఇదే బాటలో మరో హీరోయిన్ కూడా రెడీ అవుతోంది. 2001లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన చిత్రం ‘ఆనందం’ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆకాష్, రేఖ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో రేఖ తన క్యూట్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల్లో మంచి ఇంప్రెషన్ దక్కించుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన రేఖ కొంతకాలానికే సినిమాలకు దూరం అయ్యింది. దీంతో ఆమె ఇప్పుడు సాలిడ్ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె రీసెంట్‌గా ఓ యూట్యూబర్ నిర్వహించిన పోడ్‌కాస్ట్‌లో పాల్గొని అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఇక ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. వరుస పోస్టులతో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనలో యాక్టింగ్, అందం ఏమాత్రం తగ్గలేదని ఆమె నిరూపిస్తోంది. తనకు సూట్ అయ్యే పాత్రలు ఏవి వచ్చినా చేసేందుకు రెడీగా ఉంది ఈ భామ. మరి రేఖ రీఎంట్రీ ఏ సినిమాతో ఉంటుందో చూడాలని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.