ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కే ‘పరదా’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్..!

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పరదా’ ఆగస్టు 22న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేయగా సోషల్ డ్రామా చిత్రంగా రూపొందిస్తున్న ‘పరదా’ ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. దీంతో ఈ సినిమా ఎలాంటి కంటెంట్‌తో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాలో దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి.