‘అర్జున్ చక్రవర్తి’ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అదిరిపోతుంది – డైరెక్టర్ విక్రాంత్ రుద్ర

‘అర్జున్ చక్రవర్తి’ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అదిరిపోతుంది – డైరెక్టర్ విక్రాంత్ రుద్ర
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్, సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. ‘అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదు నా తొమ్మిది సంవత్సరాల కల. మా టీమ్ అంతా ఆరేళ్లపాటు హార్డ్ వర్క్ చేశారు. మా నిర్మాతగా ఇచ్చిన సపోర్ట్ ని మర్చిపోలేను. ఆయన నాపై పూర్తి విశ్వాసం ఉంచారు. హీరో విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. చాలా రిస్కులు తీసుకున్నాడు. అర్జున్ చక్రవర్తిగా కనిపించడానికి 100% ఎఫర్ట్ పెట్టాడు. ఈ సినిమాలో పనిచేసిన అందరూ కూడా చాలా డెడికేషన్ తో చేశారు. డిఓపి జగదీష్ అద్భుతమైన విజువల్స్ అందించారు. సిజ దేవిక పాత్రలో ఒదిగిపోయింది. అజయ్ గారు మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది.’ అని అన్నారు. హీరో విజయరామరాజు మాట్లాడుతూ..‘ఇప్పుటి వరకు మేము రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా డైరెక్టర్ గారు సినిమా నెక్స్ట్ లెవెల్ లో తీశారు. మా నిర్మాత మమ్మల్ని ఎంతగానో బిలివ్ చేశారు. ఆయన లేకపోతే ఇంత మంచి సినిమా లేదు. సినిమా కూడా చాలా మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాం. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా కెరియర్ లో బెస్ట్ మూవీ చేశానని ఫీల్ అవుతున్నాను. 29న ఆడియన్స్ అదే ఫీల్ అవుతారు. హీరోయిన్ సిజ కి తెలుగులో చాలా మంచి అవకాశాలు వస్తాయి. అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.’ అని అన్నారు. హీరోయిన్ సిజ రోజ్ మాట్లాడుతూ..‘మాకు ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. ఈ సినిమా కోసం చాలా ఏళ్ళు కష్టపడ్డాం. ఈ సినిమాల్లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. మీరు సాంగ్స్ కి ఇచ్చిన రెస్పాన్స్ నాకు ఎంతో ఆనందం ఇచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఆగస్టు 29 థియేటర్స్ లో కలుద్దాం.’ అన్నారు. నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ.. ‘ఆగస్టు 29న ప్రో కబడ్డీ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 29 నేషనల్ స్పోర్ట్స్ డే. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఆగస్టు 29 అర్జున్ చక్రవర్తి రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ లో 94 మిలియన్స్ రీచ్ అయింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది.’ అన్నారు.