మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!

మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన భారీ చిత్రం ‘విశ్వంభర’ కోసం అందరికీ తెలిసిందే. భారీ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఈసారి వస్తున్న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఓ బ్లాస్టింగ్ అప్డేట్ అందిస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఫైనల్ గా ఈ అప్డేట్ ఇపుడు బయటకి వచ్చేసింది. దీనితో మేకర్స్ మెగాస్టార్ తోనే ఓ స్పెషల్ వీడియో చేయించి. ఎందుకు విశ్వంభర రిలీజ్ లో జాప్యం నెలకొంది అనేది వివరణ ఇస్తూ ఈ టీజర్ ని రేపు కాకుండా ఇంకా ముందే అంటే ఇవాళ సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్టుగా కూడా రివీల్ చేశారు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.