మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే

మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
మన టాలీవుడ్ దిగ్గజ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఎప్పటిలానే ఈ ఏడాది కూడా తన పుట్టినరోజు రానే వస్తుంది. మరి ఈ బర్త్ డే నుంచి మెగాస్టార్ కి సంబంధించిన అధికారిక వార్తలు కోసం ప్రత్యేక టీం ని పెట్టుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు. తన ప్రతీ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏదైనా కూడా అధికారికంగా వారి నుంచే బయటకి రానున్నాయి. సో మెగాస్టార్ అభిమానులు అప్డేట్స్ పరంగా ఎలాంటి టెన్షన్ తీసుకొనక్కరలేదు అని చెప్పవచ్చు. ఇక మెగాస్టార్ పుట్టినరోజు రేపు కావున మొదట విశ్వంభర తోనే ఆట మొదలు కానుంది అని చెప్పొచ్చు.