పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన టిడిఆర్ సినిమాస్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ 1

టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్.1 గా కుంచం శంకర్ దర్శకత్వంలో తలారి దినకరణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం (ఆగస్ట్ 21) నాడు ఘనంగా జరిగాయి. ముహుర్తపు సన్నివేశానికి రామ్ అబ్బరాజు క్లాప్ నివ్వగా, ప్రశాంత్ కుమార్ దిమ్మెల కెమెరా స్విచాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ అబ్బరాజు, ప్రశాంత్ దిమ్మెల, అడిదాల విజయ్‌పాల్ రెడ్డి స్క్రిప్ట్ అందించారు. పవన్ కేసరి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించనుండగా కెమెరామెన్‌గా సాయి పని చేయనున్నారు.
ఇక ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా హీరో పవన్ కేసరి మాట్లాడుతూ.. ‘నా బాల్య స్నేహితుడు సన్నీ స్థాపించిన ఈ బ్యానర్ మీద సినిమాను చేస్తుండటం ఆనందంగా ఉంది. కావ్య ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్ అన్న మంచి సంగీతాన్ని ఇవ్వబోతోన్నారు. డీఓపీ సాయితో మంచి బాండింగ్ ఏర్పడింది.
హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రంలో నేను హీరోయిన్‌గా నటిస్తున్నాను. దర్శక, నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మా టీంలో ఇప్పటికే విజయ్ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఓ మంచి చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నామ’ని అన్నారు
తలారి హేమావతి రెడ్డి మాట్లాడుతూ.. ‘పవన్, కావ్యతో పని చేస్తుండటం ఆనందంగా ఉంది. శంకర్ గారు ఓ మంచి కథతో రాబోతోన్నారు. విజయ్ గారు ఆల్రెడీ మాకు మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఇలానే అందరూ మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు
డైరెక్టర్ కుంచం శంకర్ మాట్లాడుతూ.. ‘మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియాకు థాంక్స్. నాకు సహకరించి ఇక్కడకు వచ్చిన మా మూవీ టీంకు థాంక్స్’ అని అన్నారు.