తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!

తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రంలో నటించాల్సిన ఆమె కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం నుంచి తప్పుకుంది. ఇక ఆ తర్వాత ఆమె రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను ఓకే చేసి సర్‌ప్రైజ్ చేసింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌తో దీపికా నటిస్తున్న ‘కింగ్’ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకుంది. 2026లో విడుదల కానున్న ఈ చిత్రం, పఠాన్ మరియు జవాన్ తర్వాత బాలీవుడ్‌లో ఈ జోడీ క్రేజీగా మారింది. దీంతో పాటు కింగ్ చిత్రం బాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటిగా మారడంతో ఈ సినిమాలో షారుక్ ఎలా ఉండబోతున్నాడా.. దీపికాతో ఆయన ఎలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక దీపికా మరో క్రేజీ ప్రాజెక్ట్ AA22xA6. అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇండియాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే దీపికా యోధురాలి లుక్‌లో కనిపించనుండగా, ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ, భారీ కాస్ట్యూమ్స్ సిద్ధం చేస్తున్నారట మేకర్స్. రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ 2027లో విడుదల కానుంది. వరుసగా ఇద్దరు 1000 కోట్ల హీరోలతో పనిచేస్తున్న ఏకైక హీరోయిన్‌గా దీపికా తనదైన మార్క్ వేసుకుంది.