‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?

‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ ఇటీవల బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయి సందడి చేస్తుంది. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయగా రజినీ పవర్‌ఫుల్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో పలువురు స్టార్స్ కూడా నటించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో అయితే ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని చెప్పాలి. ఈ సినిమా కథ చాలా చప్పగా ఉండటమే దీనికి కారణమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే, కూలీ చిత్రం ట్రాక్ తప్పడానికి రజినీకాంత్ ముఖ్య కారణమని కోలీవుడ్ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ పాత్ర చుట్టూ తిరిగే ఒక ఆసక్తికర థ్రిల్లర్ కథను వినిపించాడట. అయితే రజనీ ఆ ప్రపోజల్‌ను తిరస్కరించి, జైలర్ తరహా స్క్రిప్ట్ రాయమని లోకేష్ కనగరాజ్‌ను కోరారు. దాంతో లోకేష్ కనగరాజ్ కూలీ స్క్రిప్ట్‌పై రీవర్క్ చేశాడట. ఈ సినిమా కోసం ఆయన ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి నటులను తెప్పించాల్సి వచ్చింది. అయితే వారి పాత్రలు సినిమాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. సినిమా భారీ ఓపెనింగ్‌తో ప్రారంభమైనా ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. లోకేష్ కనగరాజ్ మొదటి కథనే తెరకెక్కించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో అని అభిమానులు భావిస్తున్నారట. దీంతో రజనీకాంత్ కారణంగా ఫ్యాన్‌బాయ్ లోకేష్ తన ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చిందని వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.