ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!

ఇటీవల మన టాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో “కొత్తపల్లిలో ఒకప్పుడు” చిత్రం కూడా ఒకటి. క్లాసిక్ హిట్ చిత్రం కేరాఫ్ కంచరపాలెం నటి ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించిన ఈ ఇంట్రెస్టింగ్ విలేజ్ హారర్ కామెడి చిత్రం థియేటర్స్ లో డీసెంట్ రెస్పాన్స్ ని అందుకుంది. నూతన నటీనటులు మనోజ్ చంద్ర మోనికా జంటగా నటించిన ఈ చిత్రం నేటి నుంచే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
ఈ సినిమా తాలూకా హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా అందులో ఆహా గోల్డ్ వినియోగదారులకి ఒకరోజు ముందే అందుబాటులోకి వచ్చేసింది. రేపటి నుంచి మిగతా వినియోగదారులకి సినిమా స్ట్రీమింగ్ కి రానుంది. సో ఈ సినిమా చూడాలి అనుకునేవారు ఆహా లో ట్రై చేయవచ్చు.