ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?

ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
అందాల భామ పూజా హెగ్డే చివరిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఆచార్య’. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఇక రీసెంట్‌గా ఆమె హీరోయిన్‌గా నటించిన ‘రెట్రో’ చిత్ర ప్రమోషన్స్‌లో తాను తర్వలోనే తెలుగు సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నట్లు పేర్కొంది. ఒక లవ్ స్టోరీకి సైన్ చేశానని, అదే తన టాలీవుడ్ రీ-ఎంట్రీ అవుతుందని ఆమె చెప్పింది. దీంతో ఆమె మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరో బ్యూటీ శ్రుతి హాసన్ ఆ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నెటిజన్లలో పూజా రీ-ఎంట్రీ ప్రాజెక్ట్ ఏది అన్న చర్చ మొదలైంది. కొంతమంది పూజా, శ్రుతి ఇద్దరూ ఆ సినిమాలో ఉంటారని అంటుండగా, మరికొందరు పూజా స్థానంలోకి శ్రుతి హాసన్ వచ్చిందని చెబుతున్నారు. మరి ఇందులో ఏది నిజం.. అసలు పూజా సినిమాలో శ్రుతి నటిస్తుందా.. లేక పూజా స్థానంలోకి శ్రుతి వచ్చిందా అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాను రవి నెలకుడితి డైరెక్ట్ చేస్తుండగా సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేయనున్నారు.