‘విశ్వంభర’ హిందీ రైట్స్‌ను దక్కించుకున్నది వీరే..!

‘విశ్వంభర’ హిందీ రైట్స్‌ను దక్కించుకున్నది వీరే..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ట మల్లిడి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుంది. ఇక ఈ సినిమా నుంచి మెగాస్టార్ బర్త్ ట్రీట్‌గా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో హిందీ భాషలో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఇక ఈ సినిమా హిందీ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ దక్కించుకుంది. దీంతో విశ్వంభర చిత్రం హిందీలో గ్రాండ్ రిలీజ్ కానుందని తేలిపోయింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.