యాంకర్ లోబోకు జైలు శిక్ష విధించిన కోర్ట్

యాంకర్ లోబోకు  జైలు శిక్ష విధించిన కోర్ట్ - తెలుగు సినిమా updates

యాంకర్ లోబో (అసలు పేరు మోహమ్మద్ ఖయ్యూమ్) డీజే, ఆర్జేగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5కి ఎంపికై ప్రజాదరణ పొందిన ఆయన, 2018లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి వార్తల్లో నిలిచారు. ఈ ప్రమాదం కేసులో, జనగాం జిల్లా కోర్టు 2025 ఆగస్టు 28న తీర్పు వెలువరించింది. న్యాయస్థానం లోబోకు ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు రూ.12,500 జరిమానా విధించింది.


ప్రమాద ఘటన వివరాలు:

2018 మే 21న షూటింగ్ పూర్తి చేసుకుని వస్తుండగా, హైదరాబాద్‌కు మార్గమధ్యలో జనగాం జిల్లా రఘునాథపల్లి దగ్గర అయన కారు ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలోని మేడె కుమార్ (ఖిలాషాపురం), పెంబర్తి మణెమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. లోబోతో పాటు అతని వాహనంలోని ఇతర ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.


బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో, పోలీసు శాఖ లోబోపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడని కేసు నమోదు చేసింది. సుదీర్ఘ విచారణలో పలు ఆధారాలు, సాక్ష్యాలు విచారించిన తర్వాత జనగాం కోర్టు 2025 ఆగస్టు 28న తుది నిర్ణయం ప్రకటించింది. దాదాపు ఏడేళ్ల పాటు కేసు విచారణ కొనసాగింది.  లోబో నిర్లక్ష్యంగా వాహనం నడపడం ఈ ఘోర ఘటనకి కారణమన్న అభియోగాన్ని కోర్టు న్యాయబద్ధంగా నిర్ధారించింది. ఆయనకు ఒక సంవత్సరం జైలుతో పాటు రూ.12,500 జరిమానాకు విధించింది.


ఈ కేసు ద్వారా చట్టం అందరికీ సమానమే అన్న సందేశం బలంగా వెల్లువడింది. రోడ్డు భద్రతా నియమాలు, జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు ఎలా జరుగుతాయన్న స్పష్టం చేసింది. ప్రముఖులు అయినా, సామాన్యులు అయినా, వాహనం నడిపేటప్పుడు రూల్స్ పాటించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.


బిగ్‌బాస్ ద్వారా వచ్చిన బ్రాండ్ ఇమేజ్, టీవీ షోలు, సినిమాల్లో పోషించిన పాత్రలు, టాటూ ఆర్టిస్ట్‌గా వఛ్చిన గుర్తింపు ఇప్పుడు ఈ తీర్పు నేపథ్యంలో లోబో కెరీర్‌పై నెగిటివ్ ప్రభావం కలగే అవకాశముంది. ఆయన వ్యక్తిగత, వృత్తి జీవితం భవిష్యత్తులో ఎలా కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

కామెంట్స్

ఇంకా కామెంట్స్ లేవు. మీరు మొదటిగా కామెంట్ చేయండి!