నిరాశపరిచిన స్టాలిన్

నిరాశపరిచిన స్టాలిన్ - తెలుగు సినిమా updates
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22, 2025) సందర్భంగా ఆయన నటించిన హిట్ సినిమా "స్టాలిన్" ను 4K డిజిటల్ రీమాస్టర్ చేసి థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. ఈ చిత్రం దర్శకుడు ఏఆర్ మురుగదాస్. అంజనా ప్రొడక్షన్స్ లో అయన తమ్ముడు నాగబాబు నిర్మించిన ఈ సినిమాలో త్రిష, కుష్బూ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. రీమాస్టర్డ్ విజువల్స్, మెరుగైన ఆడియోతో ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని అందించాలని యత్నించింది. అదనంగా రీ-రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ అభిమానుల కోసం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కొన్ని ప్రత్యేక క్లిప్స్ కూడా థియేటర్లలో ప్రదర్శించబడ్డాయి. అయితే భారీ అంచనాలతో రీ-రిలీజ్‌కు అయినా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. టీవీలలో కూడా మంచి ఆదరణ పొందిన ఈ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి లేకపోవడానికి కారణం రీ-రిలీజ్ ల సంప్రదాయమే అని తెలుస్తుంది . ఈ సంవత్సరం ఇప్పటి వరకు 15 పైగా చిత్రాలు రీ-రిలీజ్ కు నోచుకున్నాయి. ఇకపై తెలుగు సినీ పరిశ్రమలో రీ-రిలీజ్‌లపై కొత్త ఆలోచనలు అవసరం అని భావిస్తున్నారు.

కామెంట్స్

ఇంకా కామెంట్స్ లేవు. మీరు మొదటిగా కామెంట్ చేయండి!