కూలీ నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డు

కూలీ నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డు - తెలుగు సినిమా updates
సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా “కూలీ” బాక్సాఫీస్ వద్ద దంచికొడుతోంది. విడుదలకు ముందే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనగా, థియేటర్లలో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల హైప్ తో కాసుల వర్షం కురిపించింది. కేవలం కొన్ని వారాల్లోనే “కూలీ” ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్ లిస్టులో చేరింది. ముఖ్యంగా యూఎస్ (నార్త్ అమెరికా) మార్కెట్‌లో ఈ సినిమా అద్భుతమైన రికార్డు క్రియేట్ చేసింది. ట్రేడ్ టాక్ ప్రకారం, అక్కడ ఈ సినిమా $6.719 మిలియన్లు (సుమారు ₹58 కోట్లు) గ్రాస్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ తమిళ మూవీగా నిలిచింది. తమిళనాడులో రజినీకాంత్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం డ్యాన్స్‌లు చేసి థియేటర్లను ఫెస్టివల్ మూడ్‌లోకి మార్చగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి శాతం థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు సాధిస్తోంది. రజినీ స్టార్డమ్, లోకేష్ శైలి కథనం, అనిరుద్ ఇచ్చిన ఎనేర్జిటిక్ మ్యూజిక్ మూవీని మరింతగా లిఫ్ట్ చేశాయి. “కూలీ” సినిమాలో రజినీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రతి ఒక్కరి పాత్ర స్పెషల్ అపీలింగ్‌గా ఉండటం హైలైట్‌గా చెప్పుకోవాలి. ఈ భారీ సినిమాను సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడ రాజీపడలేదు. అనిరుద్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్‌ను థియేటర్లో ఉర్రూతలూగించింది. ప్రస్తుతం "కూలీ" మరో లాండ్‌మార్క్ వసూళ్ల దిశగా వెళ్తున్నది. ట్రేడ్ సర్కిల్స్ అంచనా ప్రకారం, వరల్డ్‌వైడ్ గా ఈ సినిమా వచ్చే రోజుల్లో 500 కోట్ల మార్క్ను కూడా చేరే అవకాశముందని చెబుతున్నారు.

కామెంట్స్

ఇంకా కామెంట్స్ లేవు. మీరు మొదటిగా కామెంట్ చేయండి!