తెలుగు సినిమా ప్రేక్షకులకు సూపర్‌హీరో జోనర్‌లో మరో విజువల్ ట్రీట్‌గా రానున్న చిత్రం 'మిరాయ్'. 'హనుమాన్' లాంటి భారీ విజయం తర్వాత యంగ్ హీరో తేజ సజ్జా మరోసారి సూపర్‌హీరో అవతారంలో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈరోజు విడుదలైన 'మిరాయ్' ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ ట్రైలర్, అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, మిథాలజికల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంది.
చారిత్రక అంశాలతో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కనిపిస్తోంది. పురాతన కాలంలో రహస్య శక్తులు కలిగిన పవిత్ర గ్రంథాలను రక్షించే బాధ్యత ఒక సూపర్ యోధుడిగా తేజ సజ్జ, ఆ గ్రంథాలను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిచే చీకటి శక్తులతో జరిగే పోరాటమే ఈ సినిమా అని ట్రైలర్ ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
ట్రైలర్‌లోని VFX షాట్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. రైలు ఫైట్ సీక్వెన్స్‌లు, గరుడ సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గౌరా హరి అందించాడు తేజ సజ్జాతో పాటు మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీయా సరన్, జయరామ్, జగపతి బాబు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.
ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, చైనీస్ భాషల్లో 3D ఫార్మాట్‌లో సెప్టెంబర్ 12, 2025న విడుదల కానుంది. మొదట సెప్టెంబర్ 5న రిలీజ్ ప్లాన్ చేసినా, పోస్ట్-ప్రొడక్షన్ కోసం తేదీ మార్చారు.
కామెంట్స్
ఇంకా కామెంట్స్ లేవు. మీరు మొదటిగా కామెంట్ చేయండి!