పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “OG” విడుదలపై తాజా వార్తలు ఫ్యాన్స్‌లో కలవరపెడుతున్నాయి. ముందుగా సెప్టెంబర్ మూడవ వారంలో గ్రాండ్ రిలీజ్ జరగనుందని అధికారిక ప్రకటన వచ్చినా, ఇప్పుడు ప్లాన్‌కి ఏమైనా మార్పులు రావచ్చన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఇంకా షూటింగ్ మిగిలి ఉన్నదా?
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఇప్పటికీ సుమారు 5 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది. అందులో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కొన్ని కీలక సీన్స్ కూడా ఉంటాయట. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో, ఈ మిగిలిన షూటింగ్‌కు సమయం కేటాయిస్తారా అన్నది అనుమానంగా మారింది. ఇదే నిర్మాత దానయ్య గారికి పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
బయ్యర్స్ ఆందోళన:
“OG” సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో, డిస్ట్రిబ్యూటర్లు రికార్డు స్థాయిలో బిజినెస్ చేసేందుకు ముందుకెళ్లారు. కానీ రిలీజ్ డేట్ మరలా పోస్టుపోన్ అయితే బయ్యర్స్‌పై ఒత్తిడి పడే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ “హరి హర వీర మల్లు” సినిమా పలు సార్లు వాయిదా పడటం చర్చకి వచ్చిన విషయం అభిమానులకు తెలిసిందే. అందువల్ల ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని వారు కోరుకుంటున్నారు.
మేకర్స్ నమ్మకం
అయితే, మూవీ యూనిట్ మాత్రం “OG” కంటెంట్‌పై పూర్తి నమ్మకంతో ఉంది. రూమర్స్ కంటే సినిమా క్వాలిటీనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని, రిలీజ్ టైమ్ కాస్త ఇక్కడా అక్కడా మారినా మూవీ రేంజ్ ఏ మాత్రం తగ్గదని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అధికారిక క్లారిటీ ఎప్పుడొస్తుంది?
ప్రస్తుతం సోషల్ మీడియాలో “OG” రిలీజ్‌పై చర్చలు బాగా జరిగిపోతున్నాయి. ఈ గాసిప్స్‌పై క్లారిటీ ఇవ్వడం మూవీ టీమ్ బాధ్యతగా అభిమానులు భావిస్తున్నారు. ఇకపై చిత్రబృందం ఏ నిర్ణయం తీసుకుంటుందో, పవన్ కళ్యాణ్ షెడ్యూల్‌ని బట్టి రిలీజ్ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది
కామెంట్స్
ఇంకా కామెంట్స్ లేవు. మీరు మొదటిగా కామెంట్ చేయండి!