ఇటీవల తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్ రజనీకాంత్ మరియు కమల్ హాసన్‌ల సూపర్ కాంబినేషన్. ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే చిత్రంలో నటించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించగా ఇప్పుడు ఆ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
తమిళ బ్లాక్‌బస్టర్ జైలర్ చిత్రం ద్వారా సూపర్ స్టార్ రజినీకాంత్‌కు భారీ విజయం అందించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశముందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన జైలర్2 పనిలో నిమగ్నమై ఉండగా రజిని–కమల్ కాంబినేషన్‌పై స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినప్పటికీ, ఈ వార్త సినీ వర్గాల్లో పెద్ద హల్ ఛల్ సృష్టిస్తుంది. రజినీ కమల్ ఇద్దరూ గతంలో ఒకే ఫ్రేమ్‌లో చాలా కాలం క్రితం కనిపించారు, అందుకే ఈ సూపర్ కాంబినేషన్ ఇప్పుడు తెరకెక్కితే దక్షిణ భారత సినీ ప్రేక్షకులకు పండగ వాతావరణం సృష్టించడం ఖాయం.
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక అప్‌డేట్ లేనందున అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రజినీకాంత్ మరియు కమల్ హాసన్‌ల సక్సెస్ ట్రాక్‌లు, నెల్సన్ క్రేజ్ కలిసే సరికి ఈ సినిమా పెద్ద మైలురాయిగా నిలిచే అవకాశముంది.
కామెంట్స్
ఇంకా కామెంట్స్ లేవు. మీరు మొదటిగా కామెంట్ చేయండి!